సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికి డబల్ బెడ్రూం ఇస్తానని హామీలు ఇచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికి కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 5 శాతం ప్రజలకు కూడా ఇండ్లను ఇవ్వకపోవడం అన్యాయమని ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా అడ్డాల మీద పనిచేసే భవన నిర్మాణ కార్మికులు తమకు కూడా డబల్ బెడ్రూంలు వస్తాయని ఎదురుచూస్తే నేడు వారికి నిరాశే ఎదురైందని నేడు జగతగిరిగుట్టలో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఎప్పుడు పని దొరుకుంతుందో తెలియని వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు తమకు డబల్ బెడ్రూంలు వస్తాయని ఆశించి గత 2 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపిస్తే నేడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం మనేసారని కేవలం వర్దంతులు, జయంతులు,పార్టీ కార్యక్రమాలకు కార్మికుల దగ్గరికి వచ్చి ప్రభుత్వ పథకాలు అందచేస్తామని వాగ్దానాలు చెయ్యడమే తప్ప వారికి ఎటువంటి లాభం కలగలేదని,జగతగిరిగుట్టలో పని చేసే ఏ ఒక్కరికి కూడా డబల్ బెడ్రూం, దళిత బంధు, బీసీ బంధు, ఆసరా,వితంతు పెన్షన్,రేషన్ కార్డులు రాలేదని విమర్శించారు.
కేవలం అధికార పార్టీ నాయకులు వారి కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారని కావున కార్మికులు ఇప్పటికైనా జరిగిన మోసాన్ని గ్రహించి రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని సూచించారు. అధికారం కోసం కాకుండ ప్రజల కోసం నిత్యం పోరాడేది సీపీఐ పార్టీనేనని కావున సీపీఐ పార్టీ నిర్వహించే కార్యక్రమలో పాల్గొని ప్రజలను చైతన్య వంతం చేసి కార్మికులే ప్రభుత్వం నడిపేలా రాజ్యాధికారం కోసం పోరాడాలని అన్నారు.
రానున్న ఎన్నికల్లో డబల్ బెడ్రూం రాన్ని వాళ్ళను సంఘటితం చేసి డబల్ బెడ్రూం లైన ఇవ్వాలని లేకపోతే 80 గజాల స్థలం పంచాలనే డిమాండ్ తో పోరాటం ఉదృతం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్, జిహెచ్ఎంసి అధ్యక్షుడు రాములు,డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికులు సామెల్, యాదగిరి, ఆశయ్య,ఇమామ్, రాము,వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,బీరప్ప, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.