జగన్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనం:నాదెండ్ల మనోహర్

Spread the love

Jagan’s comments are proof of his intolerance: Nadendla Manohar

జగన్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనం:నాదెండ్ల మనోహర్

అమరావతి: జనసేనపై నరసాపురంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తీవ్రంగా ఖండిచారు.నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, వీర మహిళలు, జనసైనికులను జగన్‌ కించపర్చారని మండిపడ్డారు.

సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనమన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మనోహర్‌ పలు ప్రశ్నలు సంధించారు.


”మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?

మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?” అని నాదెండ్ల నిలదీశారు.

Related Posts

You cannot copy content of this page