గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం

Spread the love

గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు.

హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హల్లో నిర్వాహంచిన NSUI వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో NSUI రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఏఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారు పాల్గొన్నారు.

డాక్టర్ కడియం కావ్య కామెంట్స్….

కష్టపడ్డ వారికీ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఫలితం దక్కుతుంది..

యువతకు అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ..

యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది.

దేశంలో జరుగుతున్న అరాచక పాలనను అంతం చేయాలి…

దేశంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూన్న బిజెపి పాలకులను తరిమికొట్టాలి.

అందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనుకునిగా పని చేయాలి.

బిజెపి పార్టీకి ధన బలం ఉంటే కాంగ్రెస్ పార్టీ జన బలం ఉంది.

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జన బలం సత్తా ఏంటో చూపించాలి.

నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటా….

సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షల విమర్శలను తిప్పికొట్టాలి.

ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.

మీరే నాకు అన్నతమ్ముళ్లు…. మీ అక్కగా, చెల్లీగా భావించి నా గెలుపు కు కృషి చేయాలి.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్….

ఉద్యోగాల కల్పనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలం అయింది.

2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలనే ఉడగొడుతున్నారు…

ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తూ…. దేశంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నారు

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు…

ఖచ్చితంగా రానున్న రోజులలో ఇచ్చిన హామీని అమలు చేస్తామ

2లక్షల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది.

దానికి కోసం NSUI కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి.

ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర, జిల్లా నాయకులు, విద్యార్థి నాయకులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page