గొల్లగూడెంలో ఇస్లామిక్ బహిరంగ సభ

Spread the love
Islamic public meeting in Gollagudam

గొల్లగూడెంలో ఇస్లామిక్ బహిరంగ సభ


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

నగర శివారు గొల్లగూడెం తాలిముల్ ఇస్లాం మదర్సాలో గొప్ప ఇస్లామిక్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మదర్సా కరస్పాండెంట్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సభలో హైదరాబాద్ అష్రఫుల్ ఉలూమ్ మదర్సా నిర్వాహకులు మహ్మద్ అబ్దుల్ ఖవీ ప్రధాన వక్తగా హాజరవుతారని పేర్కొన్నారు. వారితో పాటు నగరానికి చెందిన మహ్మద్ సయిద్ అహ్మద్, ముఫ్తీ జలాలుద్దీన్ లు కూడా సభలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

ఈ సభలో ఖురాన్ మజీద్ కంఠస్థం చేసిన ఎనిమిది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సత్కరించడం జరుగుతుందని తెలిపారు. సభకు జిల్లా నలుమూలల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మహిళల కొరకు సభలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రవూఫ్ ఖాన్ పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page