పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్సీ కి ఆహ్వానం

Spread the love
Invitation to MLC to come to the meeting for environmental protection

పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం


సాక్షిత : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయో డీజీల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈనెల 13వ తేదీన నగరంలోని హరిహర కళా భవన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్సీ ని కోరి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు లింగంపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు గందమాల యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గణపురం గంగరాజు, ఉపాధ్యక్షులు ఎ. వేణుగోపాల్, కార్యదర్శి రాములు, శ్రీనివాస్, జి. దాసు, ఎం. రాజు, పి. చారీ, ఆర్. రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page