Invitation to construction of Vanjari Sangam building
వంజరి సంఘం భవన నిర్మాణానికి ఆహ్వానం
సాక్షిత : రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ వద్ద వంజరి సంఘం భవనం నిర్మాణానికి ఫిబ్రవరి నాలుగో తేదిన చేపట్టనున్న భూమి పూజకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని సంఘం నేతలు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ కు విజ్ఞప్తి చేశారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాలేరు నరేశ్ , కాండా రి వెంకటేష్, సాలేరు ముత్తయ్య, ప్రవీణ్, వంజరి వెంకటేష్, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మ గౌరవ భవనం నిర్మాణానికి ఎకరం స్థలాన్ని పభుత్వం కేటాయించినందుకు సి ఏం కెసిఆర్ కు వారు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.