SAKSHITHA NEWS

ప్రభుత్వ గురుకులాల ప్రవేశ పోస్టర్లను విడుదల చేసిన………. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

సాక్షిత వనపర్తి :
ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాలలో 5 6 7 8 తరగతులు చదవ కోరే విద్యార్థులప్రవేశ కోసం ప్రభుత్వం తయారుచేసిన ప్రచార ప్రకటన పోస్టర్లను మదనపురం మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఇతర మండలాల్లోని గురుకులాల ప్రిన్సిపాల్ తో కలిసి సోమవారం పోస్టర్లను విడుదల చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను ప్రక్షాళన చేస్తూ పేద విద్యార్థులు చదువుకునే విధంగా రూపురేఖలను మార్చిందని ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణాన్ని చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చిన వెంటనే ఫుడ్ మెనూని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని అలాగే కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యావంతులుగా తయారు కావాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.