భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం

Spread the love

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం

ప్రతి రోజూ విభిన్న కార్యక్రమాలతో స్వాతంత్ర్య ప్రత్యేకతను చాటుకుంటున్నాం

స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన, వెలకట్టలేని త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటున్నాం

వనపర్తిలో 3 వేల అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన ఒక ప్రత్యేకత

అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు 3 కిలోమీటర్లు వేలాది మంది జాతీయ జెండాను చేతులపై ఎత్తుకుని జాతీయ గీతాలాపన చేయడం బహూషా రాష్ట్రంలో మొదటిసారి

అత్యంత వినూత్న, అరుదైన కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు

స్వాతంత్ర్యం విలువ ప్రస్తుత తరాలకు తెలిస్తే భవిష్యత్ తరాలకు అర్దమవుతుంది

అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 2 వారాల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలకు రూపకల్పన చేశారు

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా తయారు చేయించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 3 వేల అడుగుల పొడవైన జాతీయజెండా ప్రదర్శన .. జాతీయ గీతాలాపనలో పాల్గొన్న 15 వేల మంది విద్యార్థులు, యువత, ప్రజలు

వనపర్తి అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ప్రత్యేక వాహనంలో ప్రయాణించి జాతీయ గీతాలాపనలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శన, జాతీయ గీతాలాపన కార్యక్రమానికి సహకరించి పోలీసు, వైద్యఆరోగ్య, విద్యా తదితర ప్రభుత్వ శాఖలకు, వనపర్తి లోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి

Related Posts

You cannot copy content of this page