SAKSHITHA NEWS

సాక్షిత : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలు,రోడ్ల పరిస్థితిని చూసి సమాధానం చెప్పాలని టి‌పి‌సి‌సి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ,మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ డా.మల్లు రవి డిమాండ్ చేశారు.*

*టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి * ఆదేశానుసారం *కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తో కలిసి టి‌పి‌సి‌సి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ,మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ డా.మల్లు రవి * మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ (గాజులరామారం) లోని వొక్షిత్ ఎంక్లేవ్ లో పర్యటించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్ ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు.గత వారం రోజులుగా ఇక్కడి ప్రజలు వరద నీరు ప్రవహించడం ద్వారా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని,ఇక్కడికి కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ,కార్పొరేటర్ గాని స్పందించడం లేదని,స్థానిక అధికారులు సైతం ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదని ద్వజమెత్తారు.ఆగ మేఘాల మీద ప్రగతి భవన్ అదే విధంగా సచివాలయం నిర్మించిన ఈ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ,కాలువల నిర్మాణం పట్ల ఎందుకు అశ్రద్ధ చూపిస్తున్నారో ప్రజలు తెలియచేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.విశ్వనగరం అని,బంగారు తెలంగాణ అని కల్లబొల్లి మాటలు చెప్పే కేటీఆర్ వెంటనే హైదరాబాద్ లోని వానల వల్ల తలెత్తుతున్న తీవ్ర ఇబ్బందులకు బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మల్లు రవి గారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాది రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు,131 డివిజన్ ఇంచార్జ్ ఇరుగు రాధాకృష్ణ,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,ఆర్కల విజయ్ గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి,అక్బర్,అరుణ్ రెడ్డి,బండ నవీన్,రహీమ్,దుర్గాప్రసాద్,లక్ష్మణ్,రాకేశ్,భాస్కర్,సంపత్,నరేశ్,ఖాజా భాయ్ మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS