నూతన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభం

Spread the love

నూతన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభం
ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు


సాక్షిత : జిల్లాలోని శామిర్పెట్ వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3.20 ఎకరాల్లో 15 కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమాన్ని (రుద్రమ దేవి ఓల్డ్ ఏజ్ హోం సొసైటీని) రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
అదే విధంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్ధలు) పింకేశ్ కుమార్, ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్షి, తదితరులు ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్దవాళ్ళు పసి పిల్లలతో సమానమని, వారి ఆలన పాలన చుస్కోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతో ఉందన్నారు. వాళ్ళు లేకుంటే మనం లేమని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు. ప్రభుత్వం వృద్దులకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే నీటిని అందిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఈ రుద్రమ దేవి సొసైటీ మనందరికీ ఆదర్శమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆరు గ్యారెంటీలతో రూపకల్పన చేసిందన్నారు. తొలి విడతగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాలకుర్తి, శాసనసభ్యులు యశశ్విని రెడ్డి, రాణి రుద్రమ్మ మహిళా సొసైటీ సీఈవో కవిత రెడ్డి, డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page