ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి బట్టల షాపు ప్రారంభోత్సవం

Spread the love

Inauguration of clothing shop with MLA Goodem Mahipal Reddy

పటాన్‌చెరు నియోజికవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి బట్టల షాపు ప్రారంభోత్సవం చేసిన #MDRఫౌండేషన్ గౌరవ సలహాదారులు యం.ప్రిథ్వీరాజ్ .

సాక్షిత : పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలం ఇక్రిసెట్ కాలనీలో బ్లూ ట్రెండ్స్ బట్టల దుకాణాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి #MDRఫౌండేషన్ గౌరవ సలహాదారులు యం.ప్రిథ్వీరాజ్ ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఏ రంగంలోనైనా స్వయం ఉపాధినీ వెతుకొని నిర్భయంగా ముందుకు వెళితే విజయం యువతదే అవుతుందని అన్నారు.చదువుకొని ఉద్యోగం వస్తది అని ఎదిరి చూడడం కన్నా స్వశక్తితో ఆయా రంగాలలో స్వయం ఉపాధిలో రాణించొచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి , వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page