భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *
సాక్షిత : ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమాత్రంగా ఉండలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని,ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, భారీ వానల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెల్లకుండా వుండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ విజ్జప్తి చేశారు.అదేవిధంగా కరెంట్ స్థంబాలకు, విద్యుత్ వైర్లను ,ట్రాన్స్ఫార్మర్లను తాకావద్దు అని, మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో సైతం ఇంటి నుండి బయటకు రాకుండా, పంపకుండా తల్లి తండ్రులు జాగ్రత్త పాటించాలని అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు, పెద్ద వారు కూడా అత్యవసర పనుల కోసం మాత్రమే రావాలని కోరారు, సీజన్ మార్పుతో వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు వున్నాయి కావున ఇల్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు, మి చుట్టూ పక్కల అత్యవసర పరిస్థతుల్లో పోలీస్ మరియు GHMC సిబ్బందికి గాని వార్డ్ కార్యాలయంకు గాని ,మా కార్యలయంకు గాని ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ,విజ్ఞప్తి చేస్తున్నాను అని,ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని, ఏ చిన్న సమస్య ఎదురైన మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు