SAKSHITHA NEWS

In six months of the formation of the new government, there has been zero development and pending works

సాక్షిత : నూతన ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యమై పోయిందని పెండింగ్ లో ఉన్న పనులను గాలికి వదిలేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూకట్పల్లి నియోజకవర్గ లోని ఓల్డ్ బోయన్ పల్లి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు అధికారులతో కలిసి బోయన్ చెరువు మానస సరోవర్ హైట్స్ దగ్గర నాలా పరిశీలన తో పాటుగా డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. అనంతరం అధికారులందరితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్థానిక కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా భోయన్ చెరువులో గుర్రపు డెక్కపేరుకపోవడంతో దానిని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు దోమల బారినపడి ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన నాలా పనులను చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఇలాగే జరుగుతే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని దానిని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా అధికారులు స్పందించి భోయన్ చెరువులోని గుర్రపు డెక్కన్ మరియు నాలా పనులను డ్రైనేజీ, రోడ్లు పనులు మరియు వీధి దీపాలు సరిగ్గా వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, విద్యుత్ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా నూతన పనులకు కావలసిన నిధులను జిల్లా మంత్రులను కలిసి బడ్జెట్ తీసుకోవస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు .

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్, ఇర్ఫాన్, నరేందర్ గౌడ్, మక్కాల నర్సింగ్, జంగయ్య, హరినాధ్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 24 at 14.12.16

SAKSHITHA NEWS