నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి
శీనన్న రైతు భరోసా యాత్ర
అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉదయం 11.00 పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం నుంచి పెద్ద ఎత్తున జన సమూహంతో కలిసి యాత్ర ప్రారంభించారు. కాలినడక ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగారు. శ్రీ శ్రీ విగ్రహం నుంచి కాలినడక ద్వారా నూతన కలెక్టరేట్స్ వరకు యాత్ర కొనసాగించారు. యాత్ర మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించి ఎన్ని రోజులు గడుస్తున్నాయి..? తక్షణమే అంటే ఎన్ని నెలల..? అంటూ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఈ రైతు భరోసా యాత్రకు వివిధ మండలాల నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్, ఎడ్ల బండి నడుపుతూ కూడా తన నిరసన వ్యక్తం చేశారు.