భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి

Spread the love

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున పరిష్కార మార్గాలను చూడవాల్సిందిగా కోరిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
ముఖ్యంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో 59 GO ద్వారా క్రమబద్దీకరణ చేసుకునేవారు అధిక డబ్బులు చెల్లించాల్సిందిగా రెవెన్యూ అధికారులు తెలపడంతో పక్కనే ఉన్న A బ్లాక్ కన్నB & సి బ్లాక్ వాసులు అధికమొత్తం లో చెల్లించాల్సి వస్తుండడంతో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలనీ కోరారు .

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ కాలనీ వాసులు వారి ఆస్తుల రిజిస్ట్రేషన్ శాఖ తెలుపుతున్న అభ్యంతరాలను పరిష్కరించాలని మరియు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ULC ద్వారా డబ్బులు చెల్లించి కూడా వారి స్థలాలను క్రమబద్దీకరించకపోవడం లాంటి పలు సమస్యలను GO . 58 & 59 ద్వారా దరఖాస్తులు చేసుకున్న పేద వారి ఆస్తుల క్రమ బద్దీకరణను త్వరిత గతిన పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరడమైనది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన 2 ఎకరాల స్థలము లో భవనం నిర్మాణానికి గాను నిధులు మంజూరు చేయుటకు గాను ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు సానుకూలంగా ఉన్నందున రూ. 9 కోట్ల నిధుల మంజూరుకి సహకరించి,, నిధుల మంజూరు చేయాలనీ భవణ నిర్మాణం ను త్వరితగతిన చేపట్టడానికి అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వ విప్ గాంధీ కోరారు.

ఇందుకుగాను సానుకూలంగా స్పందించిన రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ పై అంశాల పై తగు చర్యలు తీసుకుంటటానని తెలియజేసారు .

Related Posts

You cannot copy content of this page