సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేసారు. తొమ్మిది ఏండ్ల కెసిఆర్ పాలనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఒక్క పేదవాడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పది లక్షల జనాభా ఉంటె, ఎన్ని డబుల్ రూమ్ ఇండ్లు నిర్మించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్హులైన పేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో అర్హులైన నిరుపేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ముందు టెంట్ వేసి దీక్ష చేస్తానని హెచ్చరించారు.
వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుంటే టెంట్ వేస్తా…దీక్ష చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Related Posts
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ అవసరమైతే మరోసారి విచారణకు రావాలన్న పోలీసులు పోలీసుల విచారణకు సహకరిస్తానన్న అల్లు అర్జున్… SAKSHITHA NEWS
జనగామకు ఐపీఎస్ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS..
SAKSHITHA NEWS జనగామకు ఐపీఎస్ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS.. ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా…