నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి

Spread the love

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి

ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలి .

అవసరమైన చోట సొంత నిధులతో నీళ్ళిస్తా

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితులు ఉన్నచోట తాను సొంత నిధులు ఇస్తానని నీళ్లు ఇచ్చే బాధ్యత అధికారులు చూడాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మార్కాపురం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యర్రగొండపాలెం మండలంలోని అన్ని మండలాల్లో భూగర్భ జలాలు అడగంటుంతున్న పరిస్థితి అధికారులు వివరించారు. బోర్లు వేస్తె నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్న చోట తక్షణమే బోర్లు వేయాలన్నారు. పెద్దదోర్నాల మండలంలో బొమ్మలాపురం, చిన్నదోర్నాలలో మూడు బోర్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పుల్లలచెరువు మండలంలో చెన్నంపల్లి, గంగవరం గ్రామాల్లో బోర్లు వేస్తామని దూరంనుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తరలించేందుకు మా నాయకులు ఏర్పాట్లు చేస్తారని మంత్రి చెప్పారు. మండల కేంద్రమైన పుల్లలచెరువులో సాగర్ నీళ్లు పైప్ లైన్ ద్వారా ఇస్తామని అధికారులు చెప్పటంతో గ్రామంలో కొళాయిల ఏర్పాటుకు 5 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నామని ఆయన చెప్పారు.

త్రిపురాంతకం మండలంలోని దువ్వలి, లేళ్లపల్లి గ్రామాల్లో సమస్య అధికమని అక్కడ ట్యాంకర్ లతో సరఫరా చేస్తామన్నారు. యర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి, గుర్రపుశాల పంచాయతీ లతో పాటు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ట్యాంకర్ లతో నీళ్లు తోలెందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో నీళ్ల ట్యాంకర్ ల బిల్లులు రాలేదని అందరు అడుగుతున్నారని అధికారులు చెప్పారు. ఈ విషయం సీఎం దృష్టిలో ఉందని ఏప్రిల్ నెలలో బిల్లులు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారని మంత్రి సురేష్ వివరించారు. సమీక్ష లో డి. ఈ రామకృష్ణ, అన్ని మండలాల ఏ ఈ లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page