నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానే వుంటా

Spread the love

నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానే వుంటా – మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి..

తన ఎంజ్అర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కు ధీటుగా అన్ని మౌళిక సదుపాయాలతో నిర్మించిన సిర్శా వాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ట్రస్ట్ అధినేత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ కార్పొరేట్ స్థాయిలో అన్ని మౌళిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలాల నిర్మాణంలో భాగంగా తమ ఎంజేఅర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన (రెండో పాఠశాల) తాడుర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ట్రస్ట్ అధినేత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారు,ఆయన సతీమణి మర్రి జమున రాణి గారు,ఆయన సోదరుడు మర్రి వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్ గారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడు తను తన సోదరుడు ఈ సిర్శవాడ గ్రామంలో వున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాం అని తమకు విద్యా బుద్దులు నేర్పిన పాఠశాల శిధిలావస్థలో ఉండడంవల్ల తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని మౌళిక సదుపాయాలతో కొత్తగా పాఠశాల భవనాన్ని నిర్మించడం జరిగింది అని అన్నారు, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి పాఠశాల తిమ్మజిపెట్ మండల కేంద్రంలో నిర్మించడం జరిగింది అని, రెండో పాఠశాల ఈ సిర్శవాడ గ్రామంలో, మూడో పాఠశాల తాడుర్ మండల కేంద్రంలో ,నాలుగో పాఠశాల కుమ్మేరా గ్రామంలో నిర్మించడం జరిగింది అని అన్నారు, మరికొన్ని రోజుల్లో తాడుర్, కుమ్మేర పాఠశాలలను ప్రారంభిస్తామాని తెలిపారు,తన చివరి శ్వాస వరకు తమ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేస్తానే వుంటా అని అన్నారు, రాబోయే రోజుల్లో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు,సమాజంలో డబ్బులు వున్న వాళ్ళు చాలా మంది వున్నారు,వాళ్ళు సమాజసేవ పాటుపడాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page