ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ వద్ద నెలకొన్న వరద ముంపు ప్రాంతం సమస్యను మరియు నాలా ఔట్లెట్ ను, ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ మొన్న కురిసిన భారీ వర్షం ను దృష్టిలో పెట్టుకొని GHMC, జలమండలి అధికారులు, వారి సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని , లోతట్టు కాలనీ లు, ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముంపుకు గురైన కాలనీ లలో మోటర్ల ద్వారా నీటి తొలగించి యదాస్థితికి తీసుకురావాలని, రోడ్లను పునరుద్ధరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ చూడలని , ప్రజలు అబద్రత కు లోను కాకుండా ధైర్యంగా ఉండలని, వర్షాలు పడుతున్న సమయంలో ఇంటి నుండి బయటకి రాకుండా ఉండాలని, తప్పని పరిస్థితుల్లో బయటకి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులకు తెలియచేసారు. నిత్యం అందుబాటులో ఉంటానని ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని, మా కార్యాలయం దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏ ఈ విశ్వం, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, రాజుసాగర్, కృష్ణ, కాలనీ వాసులు, చలపతి రావు, విజయ్, సచిన్ కుమార్, శివరామరాజు, ప్రదీప్, మాధవ్, సన్నీ, తదితరులు పాల్గోన్నారు
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…