Happy Sankranti to the people of Kalvakurti Constituency
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు.
సాక్షిత ప్రతినిధి. జడ్పిటిసి ఉప్పల వెంకటేష్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తినియోజకవర్గం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించడం జరిగింది.కడ్తాల్ మైసిగండి మైసమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని అనంతరం ఆమనగల్ పట్టణంలో మరియు తలకొండపల్లి వెంకటాపూర్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించినటువంటి 22 ఇండ్లను గృహప్రవేశాలు మాజీ ఎంఎల్సి ప్రొఫెసర్ నాగేశ్వర్ తో కలిసి నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందనితెలియజేసారు.కరోనా కష్ట కాలంలో 14500 కిట్ల పంపిణీ,లక్ష సానిటైజర్ బాటిల్ల పంపిణి,పేదింటి కుటుంబాల ఇంటి నిర్మాణాలు,నిరుపేద విద్యార్థుల చదువు,ఉచిత అంబులెన్స్,ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ,నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు,SI మరియు కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేసారు.
అలాగే రాబోయే రోజుల్లో నియోజకవర్గం స్థాయిలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు అవోపా రాష్ట్ర అధ్యక్షుడు మల్లిపెద్ది శంకర్,ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్, జేఏసీ నాయకులు సదానందం గౌడ్ సింగిల్ విండో చైర్మెన్ కేశవ రెడ్డి,వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి,సింగిల్ విండో వైస్ చైర్మెన్ రవి,సర్పంచులు గోపాల్ నాయక్,రమేష్,లలిత జ్యోతయ్య,రఘుపతి,ఎంపిటిసిలు సునిత సుదర్శన్ రెడ్డి,అంబాజి,రమేశ్ ,రఘు,కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్ ,మాజీ ఎంపిపి రఘురాములు మరియు వివిధ గ్రామాలనుండి వచ్చిన మాజీ సర్పంచులు,ఎంపిటీసిలు,నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.