ప్రభుత్వ హాస్పిటల్ ను నమ్మి వచ్చే నిరుపేదలకు నరకం

Spread the love

Hell for the poor who trust the government hospital


ప్రభుత్వ హాస్పిటల్ ను నమ్మి వచ్చే నిరుపేదలకు నరకం చూపిస్తున్నప్రభుత్వడాక్టర్లుజనవరి 14 న్యూస్ తెలంగాణ ప్రతినిధి. ప్రభుత్వ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీల ప్రాణాలు పోతున్న పట్టించుకోని తెలంగాణ సర్కార్తెలంగాణ సర్కార్ ను నిలదీసినఓ బి సి జిల్లా మోక్ష అధ్యక్షుడు నిరంజన్ గౌడ్. బీజేవైఎం కల్వకుర్తి అధ్యక్షుడు పరశురాములునేను రాను బావయ్యో సర్కారీ దవాఖానకు అంటున్న కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్.నిర్లక్ష్యానికినిలయాలుగానిలుస్తున్నాయి. దీని తీర్వంగ ఖండించిన ఓబిసి మోక్ష అధ్యక్షుడు నిరంజన్ గౌడ్. బీజేవైఎం కల్వకుర్తి అధ్యక్షుడు పరశురాములు ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు దగ్గరిలోనే వారి సొంత ప్రవేట్ హాస్పిటల్ ఉండడం వల్ల ప్రభుత్వ ఆస్పిటల్ ను నమ్మి వచ్చేవారికి నరకం చూపిస్తున్నారని. రాత్రి 9:45 దాటితే చాలు డాక్టర్లు కనిపించరని. డాక్టర్లు ఫోన్ లో ఆజ్ఞాపిస్తే నర్సులు ఆపరేషన్ చేయడం ప్రభుత్వ హాస్పిటల్ లో నిరుపేద గర్భిణీ స్త్రీల ప్రాణాలు పోవడం మామూలే అయిపోయిందని.

దీనికి తోడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోకపోవడం ఉన్నత అధికారులు ప్రభుత్వ అధికారులకు తొత్తులుగా పనిచేయడం ప్రభుత్వ డాక్టర్లపై ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే విధంగా ప్రభుత్వ డాక్టర్ల తీరు మారిందని. నాగర్ కర్నూల్ జిల్లా మరియు ఇతర జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రులకు నిరుపేద ప్రజలు వెళ్లాలంటేభయపడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లు యమలోకాన్ని తలపిస్తున్నాయని ప్రభుత్వ హాస్పిటల్ లకు ప్రజలు వెళ్లాలంటే.నేను రాను బావయ్యో సర్కారీ దవాఖానకు అనే విధంగా తయారయిందని.

నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని గవర్నమెంట్ ఆస్పత్రులకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వెళ్లాలంటే తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆసుపత్రిలో సరైన వసతులు ఉండవు, డాక్టర్లు సమయానికి ఉండరు, మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ అసలే ఉండడు, కల్వకుర్తి లోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చే మహిళలు నరకం అనుభవిస్తున్నారు.

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ మహిళలను ఏదో కుంటి సాకుతో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, హైదరాబాదు వంటి ఆసుపత్రులకు రేఫర్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ డాక్టర్లు ఎందుకు ఉన్నట్టు. బాధితులు ఏమైంది ఇలా రెఫర్ చేస్తున్నారు అని అడిగితే గర్భిణీ స్త్రీ కి మెరుగైన వైద్యం అందించాలని, నాగర్ కర్నూల్ జిల్లా మొత్తంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన వసతులు లేవని, మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ లేడని ప్రభుత్వ ఆసుపత్రిలోసాకులుచెబుతున్నారు.

కల్వకుర్తి మండలం లోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం సుమారు అర్ధరాత్రి 12, గంటలకు కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి పురిటి నొప్పులతో వచ్చింది. ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది చూసి ఇక్కడ మొత్తం ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ లేడని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి రివర్ చేశారు. ఇలా అర్ధరాత్రి వచ్చిన పేషంట్లను జిల్లాలోని ఇతర ఆసుపత్రులకు అర్ధరాత్రిలు పంపించడం ఏమాత్రం ప్రభుత్వ డాక్టర్లకు కరెక్టు అనిపిస్తుందని నియోజకవర్గప్రజలు అంటున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లకు వారి ప్రైవేట్ ఆస్పత్రులపై ఉండే ప్రేమ ప్రభుత్వ హాస్పిటల్ లకు వచ్చే పేషంట్లపై లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి ఏదో చూసి చూడనట్టుగా చుట్టం చూపుగా వచ్చి చూసి పోతుంటారు. మిగతా టైం లో తమ ప్రైవేట్ ఆస్పత్రికి కేటాయిస్తూ ఉంటారు. ఒక ప్రభుత్వ డాక్టర్ గా ఉద్యోగం చేస్తూ తమ వ్యక్తిగత అవసరాల కోసం సంపాదన కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని కల్వకుర్తి నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

చిన్న కడుపునొప్పి వచ్చి పోయినా సరే వేరే ప్రైవేట్ హాస్పిటలకుఆసుపత్రులకు ప్రభుత్వ డాక్టర్ లే కమిషనర్ల కోసం ఆశపడి రిఫర్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.కల్వకుర్తి లోని ఒక బాధితుని వివరణ అడగగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి కాన్పుగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఇక్కడ ఉంచుకుంటామని, రెండు మూడు కాన్పులైనా గర్భిణీ స్త్రీలని వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తామని డాక్టర్లు అంటున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచనతో ఆసుపత్రులను ఎన్నో వసతులు కల్పిస్తున్నారు. అందులో వసతులు కూడా చాలా బాగున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి డాక్టర్ అతని డ్యూటీ ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది. అతను ఎన్ని గంటలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటున్నాడు.


ఎన్ని గంటలు తన ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటున్నాడు దీనిపై ప్రభుత్వం వారు పర్యవేక్షించి తమ డ్యూటీ సక్రమంగా చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page