SAKSHITHA NEWS

సాక్షిత : రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు- ఎమ్మెల్యే కే పి వివేకానంద్…
అర్హులైన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో గృహలక్ష్మి పథకం 779 లబ్ధిదారులు దుండిగల్ మున్సిపాలిటీ -679, కొంపల్లి మున్సిపాలిటీ – 110, నిజాంపేట్ మున్సిపాలిటీ – 10కి ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముక్యతిదిగా పాల్గొని మంజూరైన పాత్రలను అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు గృహలక్ష్మి పథకం ఓ వరమని, పేదల సొంతింటి కల నేరవేర్చిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని అన్నారు. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు, బీఆర్‌ఎస్‌ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. గత పాలకుల హయాంలో గ్రామాలకు లక్ష రూపాయల నిధులు తేవాలంటే సాధ్యం అయ్యేది కాదని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పెన్షన్లు, రైతుబందు, కల్యాణలక్ష్మి, దళితబంధు, బీసీబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.


ఈ కార్యక్రమంలో అధికారులు, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుండిగల్ వైస్ చైర్మన్ పద్మ రావు, మాజీ మేడ్చల్ మల్కాజ్గిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి యాదవ్, గ్రంధాలయ మాజీ చైర్మన్ నాగరాజు, కౌన్సిలర్ లు మురళి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, జక్కుల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, సంక్షేమ సంఘాల నాయకులు సభ్యులు, మహిళా నాయకురాలు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 07 at 6.18.02 PM

SAKSHITHA NEWS