గవర్నర్ వ్యవస్థను రద్దు చెయ్యాలి.

Spread the love


Governor system should be abolished.

గవర్నర్ వ్యవస్థను రద్దు చెయ్యాలి.
సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్.

గవర్నర్ వ్యవస్థను రద్దు చెయ్యాలని కోరుతూ నేడు సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ మండలంలోని సీపీఐ కార్యకర్తలు రాజ్ భవన్ కు వెళ్లడం జరిగింది.


ఈ సందర్భంగా వారిని అరెస్టు చేసి రాంగోపాల్ పెట్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన చట్టాలను నిలిపివేయడం అప్రజాస్వామికమని,నేడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్లు మరింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ పార్టీల తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హరనాథ్,కిషన్,రాములు,సహదేవ్, శ్రీనివాస్,శివ, నరేంద్రచరీ, జార్జ్,నర్సింహ రెడ్డి, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page