సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్ కు చెందిన వెంకటలక్ష్మి, సుచిత్రకు చెందిన ఎం. సాయి చరణ్, గాగిల్లాపూర్ తండాకు చెందిన కే. రేఖ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆర్ధిక స్థితి బాగలేకపోవడంతో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం నుండి వైద్యం కోసం వెంకటలక్ష్మి కి రూ. 3 లక్షలు, సాయి చరణ్ కు రూ.2.5 లక్షలు, కే. రేఖ కు రూ.2 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ ఓ సీ లను మంజూరు చేయించారు. శంభీపూర్ లోని కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు హన్మంత రావు, ఎంబరి ఆంజనేయులు, సుబ్బారావు, అమర్ సింగ్, రవి నాయక్, రంగయ్య, ప్రవీణ్ నాయక్, మేడి చంద్రశేఖర్, జగదీష్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.
రూ.7.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సీలను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…