లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి.
-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాల గురించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులందరూ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అధికారి వారి శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల నియమావళిని తెలియజేయాలని, ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సి-విజిల్ యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడతాయని, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సంఘటనలు జరిగిన ఫోటోలు, వీడియోలతో సహా సి-విజిల్ యాప్ లో అప్లోడ్ చేయవచ్చని అయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, మాస్టర్ ట్రైనీ కొండపల్లి శ్రీరామ్, అసిస్టెంట్ మాస్టర్ ట్రైనీ మదన్ గోపాల్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.