SAKSHITHA NEWS

గట్టు మండల కేంద్రంలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం నేర్పుటకు గానూ ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ప్రారంభించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ సుమారు 30 ప్రైమరీ పాఠశాలలను దత్తత తీసుకొని మూడు, నాలుగు మరియు ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీషులో ప్రావీణ్యం సాధించుటకు గాను డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి రూమ్ లో స్టడీ ఫర్నిచర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.


ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పాలకులు విద్యపరంగా అత్యంత వెనుకబాటుతాననికి గురైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గట్టు సర్పంచ్ ధనలక్ష్మి,నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,అలంపూర్ సమన్వయకర్తలు నాగేశ్ యాదవ్,గౌనింటి వీరేష్,గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు,ఉపాధ్యక్షుడు దయాకర్,కవి అవని నాయకులు లవన్న,వెంకట్ రాములు, విష్ణు,తిమ్మప్ప,లక్ష్మన్న ప్రేమ్ రాజ్,యేసు,భీమన్ గౌడ్,అంజి,దస్తగిరి గౌడ్, భూపతి తిరుపతి తిరుమలేష్,హనుమేష్, పరుష,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS