General Manager of South Central Railway who came to inspect Jammikunta Railway Station
సాక్షిత : జమ్మికుంట రైల్వేస్టేషన్ తనిఖీకి వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసి పలు రైల్వే సమస్యలపై వినతిపత్రం అందజేసిన *ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి *.
ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో మాట్లాడుతూ జమ్మికుంట రైల్వే స్టేషన్ దాదాపు 150 గ్రామలకు అనుసంధానించబడి ఉందని ఇక్కడి నుండి ప్రతీ రోజు వేల సంఖ్యలో ప్రజలు లో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారని,
జమ్మికుంట రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని దాని వల్ల రైల్వే కు ఎక్కువ ఆదాయం వస్తుందని అధేవిధంగా రైల్వే స్టేషన్ పక్కన మున్సిపల్ రోడ్ వెడెల్పు చేయుటకు అనుమతించాలని మరియు జమ్మికుంట రైల్వే స్టెషన్ లో లిఫ్ట్ సదుపాయం కల్పించాలని జీఎం ని కోరారు.
సానుకూలంగా స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సమస్యలపై ఒక నివేదికను ఏర్పాటు చేసి సమస్యలను త్వరలోనే పరిష్కరం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు , ఎంపీపీ మమత దుర్గాప్రసాద్ , జెడ్పీటీసీ శ్రీరాం శ్యాం , వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటీ , జమ్మికుంట కౌన్సిలర్ లు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆరెస్ కార్యకర్తలు పాల్గొన్నారు