Garmi Sharif festival under the rule of Gandhinagar Muslim minority
గాంధీనగర్ ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో గార్మి షరీఫ్ పండుగ
సాక్షిత ప్రతినిధి.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీ 14వ వార్డ్ లోని సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్న జి.ఎన్. గల్లి లో గార్మి షరీఫ్ పండగ సందర్భంగా గాంధీనగర్ ముస్లిం మైనార్టీయువతఆధ్వర్యంలోఅన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.
కులమత బేదాలు లేకుండా ఎంతో ఘనంగా ముస్లిం సోదరులు గ్యార్మి పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా అంజత్ ఖాన్. మహమ్మద్ రవుఫ్. సయ్యద్ ఏజాజ్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యాయబద్ధమైన జీవితం గడపాలని ప్రపంచ శాంతి కోసం పాటుపడాలని కుల మత భేదాలు మరిచి అందరి బాగు కోరుకోవాలన్నారు. ప్రతి ఏటా గార్మి పండుగను ప్రపంచమంతా ముస్లింలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారని కుల మత భేదం లేకుండా అన్నదాన కార్యక్రమం
చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గాంధీనగర్ యువతకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజత్ ఖాన్. మహమ్మద్ రౌప్. సయ్యద్ ఎజాస్ అలీ. అబ్దుల్ సమీ. ఇర్ఫాన్. జహీర్. సల్మాన్. సోహెల్. సబి. రఫీ. ముజాహిద్ ఖాన్. అఫ్రోజ్. అయూబ్ ఖాన్. ఖాదర్. ఉస్మాన్. బషీర్. హమెద్. సమీర్. అన్వర్. తదితరులు పాల్గొన్నారు.