Ganpati Navratri celebrations in Kodada
కోదాడలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
సకల విఘ్నాలు తొలగాలి
విజయ గణపతి దేవాలయంలో అన్నాభిషేకం
అన్నదాన మహాదానం
కోదాడ పట్టణంలోని పలు వినాయక విగ్రహాల వద్దప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానం ప్రారంభించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ .
సకల విఘ్నాలు తొలగించే ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి పేదల ఆకలి తీరుస్తున్న వినాయక ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని ఎమ్మెల్యే అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా,ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రార్థించారు ప్రజలందరూ సుఖసంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ కవిత రాధారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, పట్టణ కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, ఒంటిపులి రమ శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, కోట మధు,,ఖదీర్, మైస రమేష్, మేదర లలిత,ఖాజా,సాదిక్, బెజవాడ శ్రవణ్,డాక్టర్ బ్రహ్మం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథరామిరెడ్డి,ఓరుగంటి బ్రహ్మం, గ్రంథాలయ చైర్మన్ రహీం, నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, టిఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి భాస్కర్, నెమ్మది దేవమని ప్రకాష్, కే ఎల్ ఎన్ ప్రసాద్, ముత్తారపు రమేష్,అప్పారావు, కాలిదాస్ వెంకటరత్నం, వసదేవా రావు, గీత, టిఆర్ఎస్ నాయకులు గోపురపు ఉపేందర్, బత్తుల ఉపేందర్, సాలయ్య, అవినాష్, సోమేశ్వరరావు, వెంకటరమణ, నాగుల్ మీరా, సన్నీరు మురళి, శ్రీను,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు