ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలి.

Spread the love

ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలి.
-ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమిష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఏలూరు ఎస్పీ డి.మేరి ప్రశాంతి అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలో అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం, ఏలూరు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఏలూరు ఎస్పీ మేరి ప్రశాంతి, ఖమ్మం అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, కల్లూరు ఏసీపీ రఘు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్,
జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచందర్, న్యూజివీడు డిఎస్పీ లక్ష్మయ్య, సరిహద్దు పోలీస్ స్టేషన్ల సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు. సమావేశంలో పోలీస్‌ అధికారులు మాట్లాడుతూ అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సరిహద్దులో పటిష్ట నిఘా పెట్టడంతో పాటు అక్రమ మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలన్నారు.
ఎన్నికల నియమావళి పరిరక్షణే ధ్యేయంగా సరిహద్దు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ విషయంలో ఇరు జిల్లాల, రాష్ట్రాల అధికారులు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం తదితర అంశాలపై చర్చించారు.


రౌడీ షీటర్లు,గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సరిహద్దులో హైవే పెట్రోలింగ్‌, మొబైల్‌ పెట్రోలింగ్‌ పెంచాలని, పోలీస్‌ అధికారులు వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని,సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు చెక్‌ పోస్టులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకొని నిరంతరాయంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page