జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love

Former MP Ponguleti’s visit to the district

జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంజిల్లాలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన రైట్ఛాయిస్ అకాడమీ సెమినార్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన చింతనిప్పు కృష్ణ చైతన్య కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఎస్.ఆర్. గార్డెన్స్ లో జరిగిన ఆర్ ఎం పీ వైద్యుల ప్రథమ మహాసభలో పాల్గొని ప్రసంగించారు. అదేవిధంగా ఖానాపురం, బల్లేపల్లి డివిజన్లలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఖమ్మ ం రూరల్ మండలంలోని దానవాయిగూడెం, ఆరెకోడు, ముత్తగూడెం గ్రామాలను సందర్శించారు.

పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. చింతకాని మండలం మత్కేపల్లి నామవరం, జగన్నాథపురం గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొణిజర్ల మండలం పెద్దగోపతిలో జరిగిన చర్చి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.


ఈ పర్యటనలో పొంగులేటి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బొమ్మెర రామ్మూర్తి, డాక్టర్ కోటా రాంబాబు, వైరా నియోజకవర్గ ఆత్మకమిటీ ఛైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, దుంపల రవికుమార్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, వడ్డెబోయిన శ్రీను, చింతమళ్ల గురుమూర్తి, బోడా శ్రావణ్ కుమార్, అల్లీపురం నాగేశ్వరరావు,

అర్వపల్లి శివ, ఎయిర్టెల్ నరసింహారావు, పండిట్, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, యువనేత గోపి, మెండె వెంకటేశ్ యాదవ్, సూతగాని ఉపేందర్, కాంపాటి రమేష్, దుర్గా, మొగిలిచర్ల సైదులు, వట్టికూటి సైదులు గౌడ్, సర్పంచ్ పరికపల్లి శీను, రాయల పుల్లయ్య, నరసింహారావు, రంజిత్, తిరుమల రెడ్డి, కన్నెబోయిన సీతారామయ్య, నారపోగు వెంకటేశ్వర్లు, వలమాల నాగేశ్వరరావు, బూర వీరబాబు, నెల్లూరి రమేష్, ఆలస్యం నాగయ్య, ఎంపీటీసీ తిరుపతి అంజయ్య, బాలకృష్ణ, తిరుపతి చలమయ్య, మందడపు శీను, తిరుపతి రామ్మూర్తి, కోలేటి రాధ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page