పినపాక లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love

Former MP Ponguleti’s visit to Pinapaka

పినపాక లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అశ్వాపురం, మణుగూరు మండలాలను సందర్శించారు. అశ్వాపురంలోని మొండికుంట, నెల్లిపాక బంజర, బిజి కొత్తూరు, మణుగూరులోని తోగ్గూడెం, సంతోష్ నగర్, పి.వి కాలనీ, బొంబాయికాలనీ, ఎన్టీఆర్ నగర్,

కూనవరం, విప్పల సింగారం, చెరువు ముందు సింగారం, సమితి సింగారం, సుందరయ్య నగర్, శేషగిరి నగర్, రాజుపేట, ఆదర్శనగర్, రాజీవ్ గాంధీనగర్, అశోక్ నగర్, గొల్లకొత్తూరు, శాంతినగర్, పగిడేరు, పగిడేరు ఎస్టీ కాలనీ, సాంబాయిగూడెం, రామనుజవరం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన పలువురు వ్యక్తులను పరామర్శించి ఓదార్చారు.

వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సాయాలను కూడా అందజేశారు. ఆపదలో అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల వివాహం చేసుకున్న పలు నూతన జంటలను ఆశీర్వదించి పట్టువస్త్రాలను కానుకగా అందజేశారు.

పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page