మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని బ్లాక్ -బీ సంక్షేమ సంఘం సభ్యులు

Spread the love

Former MLA Koona Srisailam Goud is a member of Maisammanagar Block-B Welfare Association

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన మైసమ్మనగర్ బ్లాక్ -బీ సంక్షేమ సంఘం సభ్యులు


*సాక్షిత : * జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మైసమ్మనగర్ బ్లాక్ -బీ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని శ్రీశైలం గౌడ్ ని కోరి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి ఆంజనేయులు, రవీందర్, కోశాధికారి సంతోష్, సభ్యులు బస్వప్ప, నాగేశ్వర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు, వెంకటరావు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page