SAKSHITHA NEWS

శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన దేవస్థాన కమిటీ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మరియు కూన శ్రీనివాస్ గౌడ్ కి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు శ్రీవారి బ్రహ్మోత్సవాల జాతరకు ఆహ్వానాన్ని అందజేశారు..

— అనంతరం వారి ఆహ్వానాన్నీ స్వీకరించి.. గుడికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు..

ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు ఠాకూర్ రాజేందర్ సింగ్, లక్ష్మణ్, పి బలరాం, మురళి గౌడ్, లింగం గౌడ్, శ్రీరాము గౌడ్ గార్లతోపాటు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app