అట్లూరిరామ్మోహన్ రావు కన్నుమూత

Spread the love
Former MD of Ramoji Film City Atluri Rammohan Rao passed away

రామోజీ ఫిలిం సిటీ మాజీ ఎండి అట్లూరి రామ్మోహన్రావు కన్నుమూత

హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థలకు సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్రావు (87) కన్నుమూశారు.

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స | పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. అట్లూరి. రామ్మోహన్ రావు 1935లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. ఉపాధ్యాయుడిగా ఆయన తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

1975లో ఈనాడుతో ప్రస్థానాన్ని | ప్రారంభించిన రామ్మోహన్రావు.. రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేశారు. ఈనాడు దినపత్రికకు గతంలో మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు.

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఆయన సహాధ్యాయి, బాల్య స్నేహితులు. ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో రామ్మోహన్రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page