ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దళితబంధు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దళితబంధు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోట్ పల్లి మండల కేంద్రంలో కోట్ పల్లి మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు సత్యం కు దళిత బంధు పథకంలో మంజూరైన స్టీల్ & సిమెంట్ షాప్ ను మరియు రాంపూర్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు లక్ష్మణ్ కు దళిత బంధు పథకంలో మంజూరైన టెంట్ హౌస్ షాప్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం
కేసీఆర్‌ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page