SAKSHITHA NEWS

ఫ్లై యాక్సిస్” అబ్రాడ్ ఎడ్యుకేషన్ ను ప్రారంభించిన విద్యావంతుడు, కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

కొంపల్లి మున్సిపాలిటీ పరిధి వెన్ సాయి వద్ద సాయి గణేష్ రెడ్డి, దిలీప్ రెడ్డి, గణేష్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ఫ్లై యాక్సిస్” అబ్రాడ్ ఎడ్యుకేషన్ ను విద్యావంతుడు, కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… రోజురోజుకు యువత విదేశీ విద్య వైపు మొగ్గు చూపుతున్నారని, విద్యార్థులకు విదేశీ విద్య అందించడంలో “ఫ్లై యాక్సిస్” అబ్రాడ్ ఎడ్యుకేషన్ విదేశీ విద్యలో ట్రేడ్ మార్క్ గా నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కాలే నాగేష్, కాలే గణేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app