స్వామి భిక్ష ప్రసాదం దొరకడం మహాభాగ్యం

Spread the love

Finding Swami Bhiksha Prasad is a great blessing

స్వామి భిక్ష ప్రసాదం దొరకడం మహాభాగ్యం

దాతలను అభినందించిన బిజెపి సీనియర్ నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందె బాబయ్య తదితరులు
రంగా రెడ్డి జిల్లా సాక్షిత


అయ్యప్ప మహా ప్రసాదం నిత్యం దొరకడం ఎంతో మహా భాగ్యం అని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని శివ మారుతి దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని గురు స్వాములు శ్రీశ్రీ సతీష్ నాయర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తోపాటు అందే బాబయ్య, మఠం రుషికేష్, మల్చలం మురళి, వెంకటేష్, పాండురంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. పలువురు స్వాములకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో అనేకమంది ప్రముఖులు ఎంతో భక్తితో విరాళాలు స్వామివారి కోసం సమర్పించి వాటితో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అయ్యప్ప భక్త సమాజాన్ని ఉద్ధరించడం గొప్ప విషయమని అన్నారు.

అయ్యప్ప భక్త సమాజం నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయ్యప్ప మకరజ్యోతి వరకు అన్నదాన కార్యక్రమం నిత్యం కొనసాగుతుండడం ఎంతో పుణ్యఫలం అని అన్నారు. స్వాములు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివ మారుతి గీత అయ్యప్ప మందిరంలో వచ్చి బిక్ష చేసుకోవచ్చని సూచించారు..

Related Posts

You cannot copy content of this page