‘Exam Warriors – Art Competition’ as part of ‘Pariksha Pe Chircha’ at Sadhana High School
సాధన హైస్కూల్ లో ‘పరీక్ష పే చర్చ’ లో భాగంగా ‘ఎక్సామ్ వారియర్స్ – ఆర్ట్ కాంపిటీషన్’
*ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
పరీక్షలను పండుగలుగా భావించి మంచి ఫలితాలు సాధించాలి
సాక్షిత : సూరారం డివిజన్: ప్రధాన మంత్రి ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా మార్కండేయ నగర్ లోని సాధన హైస్కూల్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ‘ఆర్ట్ కాంపిటీషన్’ కు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై, గెలిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సృజన, ఉత్సాహం చూసాక, పరీక్షలను & వాటి ఉత్తిడిని తప్పకుండ జయిస్తారని నమ్మకం కలిగిందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.
పరీక్షలను పండుగలుగా భావించి, మంచి ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్ధులకు సూచించారు. ఈ నెల 27 న ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ‘పరీక్షా పే చర్చ’ ద్వారా వర్చువల్ ప్రసంగిస్తారని, దానిలో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి , పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి , బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి, భావిగడ్డ రవి, ఎక్సామ్ వారియర్స్ నిర్వహణ కమిటీ సభ్యులు దయాకర్, డివిజన్ అధ్యక్షులు దుర్యోధన రావ్,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ సాయిరాం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజేష్ మిశ్రా, నాయకులు దీపక్, కేశవ్, సందీప్, శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.