Enforcement of PD Act against accused in 10 property theft cases: Police Commissioner
10 ప్రాపర్టీ చోరీ కేసుల్లోని నిందుతుడిపై పీడీ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న
రఘునాధపాలెం మండలం,
రెగులచెలక గ్రామానికి చెందిన నిందితుడు జంగా వెంకన్న 31 సం,,పై పీడీ యాక్ట్ అమలు చేసిన్నట్లు పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
జలసాలకు అలవాటుపడి,
దొంగతనం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో తాళాలు వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇటీవల నగరంలోని బ్యాంక్ కాలనీలో శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయం తాళాలు పగలగొట్టి బంగారు ,
వెండి ఆభరణాలతో పాటు హుండీలో గల నగదును అపహరించుకొని పారిపోయిన ఘటనలో కూడా ప్రధాన నిందుతుడని తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 చోరీ కేసుల్లో అరెస్ట్ అయిన నిందుతుడు ప్రస్తుతం బెయిల్ పై వున్నట్లు తెలిపారు. ఖమ్మం ఖానాపురం హావేలి (03) కూసుమంచి (01) నేలకొండపల్లి( 01)ముదిగొండ ( 01)ఖమ్మం రూరల్ (01 ) రఘునాథపాలెం ( 01) ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో (02)మొత్తం 10 ప్రాపర్టీ చోరీ కేసుల్లో నిందుతుడిగా వున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఇలాంటి నేరగాళ్లు బయట తిరుగుతున్నంతకాలం దొంగతనాలు, నేరాలను అదుపు చేయడం కష్టాసాధ్యమని, అందుకే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ)యాక్ట్ నిందితుడిపై అమలు చేసినట్లు తెలిపారు. నేరాలు ప్రవృత్తిగా మార్చుకొని
దొంగతనాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నేరగాళ్ళపై నిఘా పెట్టామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా నిందుతులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ప్రాపర్టీ దొంగతనాల కేసుల్లో రిమాండ్ అయి బెయిల్ పై వున్న నిందితుడు తిరిగి నేరాలు చేసే ఆవకాశం వున్నందున ఈరోజు పీడీ యాక్ట్ అమలు చేస్తూ.. ఖమ్మం ఆర్బన్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిందుతుడిని హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.