గాజులరామరం లో కబ్జాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు కాపాడండి.జిల్లా కలెక్టరేట్ లో సీపీఐ పిర్యాదు.

Spread the love

గత నెల మునిసిపల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ గారు ప్రభుత్వ అధికారులు గుర్తించిన 2500 అక్రమ నిర్మాణాలను తొలగించమని ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలుచెయ్యకపోవడం వల్ల ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిపోతోందని,కావున కేవలం ఆదేశాలు,తూతూ చర్యలు కాకుండా నిజమైన చర్యలు తీసుకోవాలని నేడు సీపీఐ మండల నాయకులు నేడు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చెయ్యడం జరిగింది.


ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ అధికారుల ఆదేశాలను పాటించకపోవడం చూస్తుంటే అధికారుల ఆదేశాలకు విలువ లేకుండా పోతుందని, మొదట్లోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంత భూమి కబ్జా కాకుండా ఉండేదని భూమి కబ్జాలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని కావున జిల్లా కలెక్టర్ గారు స్వయంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్కడ కేవలం భూమి కబ్జామాత్రమే అవట్లేదని ప్రజల శాంతి భద్రతల సమస్య కూడా అవుతుందని అందువల్ల అదేశలో ఉన్నట్లుగా కబ్జాదారుల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారూ. అదేవిధంగా పరికి చెరువు కూడా కబ్జాదారుల పాలై కుచించుకు పోయిందని ఈ విషయం పై స్థానిక ఎమ్ ఆర్ ఓ,ఆర్ డి ఓ గారికి వినతి పత్రం ఇచ్చిన ఎలాంటి చర్యలు లేవని అన్నారు. అధికారులు భూములను ఎందుకు కాపాడలేక పోతున్నారో అర్థం అవట్లేదని కాపాడక పోతే సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్, ప్రజానాట్యమండలి కార్యదర్శి ప్రవీణ్, మండల నాయకులు శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page