ఎమ్మెల్యే “మీతో నేను” పర్యటనతో విద్యుత్ సమస్యలు పరిష్కారం

Spread the love

Electricity problems solved with MLA “Meto Me” tour

ఎమ్మెల్యే “మీతో నేను” పర్యటనతో విద్యుత్ సమస్యలు పరిష్కారం…

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న “మీతో నేను” కార్యక్రమం ఇటీవల కాలంలో ధారూర్ మండలం తరిగోపుల గ్రామంలో పర్యటించారు. ప్రజలు తెలిపిన విద్యుత్ సమస్యలు పరిష్కారం చేయాలని, ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించగా… గ్రామంలో నూతన స్తంభాలు వేయడం మరియు గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయడం వంటి పనులు వెంటనే పరిష్కారం చేయడం జరిగింది.

ఎమ్మెల్యే పర్యటనతో గ్రామంలోని విద్యుత్ సమస్యలు పరిష్కారం కాగా గ్రామ సర్పంచ్, గ్రామప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ… ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page