సాక్షిత : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నిలిచిన వర్షపు నీటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సిబ్బంది సహకారంతో తొలగింపు చేయుటకు సాయిశక్తుల పనిచేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్య వాహనాల రాకపోకలు త్వరితగతిన సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారితోపాటు రవీంద్ర రాథోడ్ తదితరులు ఉన్నారు.*
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…