డా. అయూబ్ హుస్సేన్ ఆధ్వర్యములో సమీక్ష సమావేశం నిర్వహించటం

Spread the love

Dr. Conducting review meeting under Ayub Hussain

స్థానిక భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ విజయవాడ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ : ఉర్దూ అకాడమీ హెడ్ ఆఫీస్ నందు రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న లైబ్రర్ మరియు కంప్యూటర్ సెంటర్ల ఉద్యోగులకు సంస్థ చైర్మన్ గారైన హెచ్ నదీమ్ అహ్మద్ మరియు డైరెక్టర్ / సెక్రటరీ డా. అయూబ్ హుస్సేన్ ఆధ్వర్యములో సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగినది.

ఈ సమీక్ష సమావేశం . ముఖ్యముగా ఉర్దూ లైబ్రరీలు, కంప్యూటర్ సెంటర్లు మరియు ఉర్దూ భాష గురించి సమీక్ష ప్రారంభిస్తూ ఉర్దూ భాషను రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి కి ఉర్దూ అకాడమీ చైర్మన్ హెచ్ నదీమ్ అహ్మద్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు.

డైరెక్టర్ మాట్లాడుతూ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు ఉపముఖ్య మంత్రి జవాబ్ .. అంజాద్ బాష ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. జనాజ్ అంజాద్ బాష మైనారిటీస్ సంక్షేమ శాఖ మంత్రి పదవి అలంకరించిన తరువాత మైనారిటీ సంక్షేమ శాఖ అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలియజేశారు.


ఈ సమీక్షలో ముఖ్య నిర్ణయాలు అనగా ఉర్దూ భాష అభివృద్ధి కి ముఖ్యమైన అంశాలను తక్షణం అమలు చేయాలని నిర్ణయం. -తీసుకున్నారు. ముస్లిం ముస్లిమేతరులు, కులమతములు, వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ, పురుషులకు ఉచితముగా ఉర్దూ భాష ను ప్రతిరోజు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చదవటం, వ్రాయటం నేర్పించటం ఉర్దూ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఉర్దూ భాష గురించి ఉర్దు భాషాభివృద్ధికి తోడ్పడిన ప్రముఖులు గురించి వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వ హించి వారికి తగిన బహుమతులు అందించటం మరియు ఉర్దూ లైబ్రరీల ఆధ్వర్యములో ముషాయిరా, సెమినార్, కాన్ఫరెన్స్ లు నిర్వహించి ఉర్దూ భాషను అభివృద్ధి చేయటం జరుగుతుందని ఈ సందర్భముగా తెలియ జేశారు.


ఈ సమీక్షలో లైబ్రరీలు మరియు కంప్యూటర్ సెంటర్ల అభివృద్ధి చేయుటకు స్థానికంగా ఒక కమిటీని నియమించి ఆ కమిటి ద్వారా ప్రతినెల సమీక్ష నిర్వహించి సమస్యలుంటే పరిష్కరిస్తారని తెలియజేసారు. ఈ కమిటీలో స్థానిక లోకల్ సర్పంచ్ లేదా కార్పొరేటర్ చైర్మన్ గా. ఉంటారని మెంబర్లు గా ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్, సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఉర్దూ ప్రొఫెసర్ / ఉర్దూ డి.ఐ, కనీసం ఇద్దరు స్త్రీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలని ఈ సందర్భముగా తెలియజేసారు.


ఉచిత కంప్యూటర్ శిక్షణ 6 నెలల కోర్స్ స్థానములో 3 నెలల కోర్స్ ప్రారంబిస్తామని మరియు నిరుద్యోగులు తక్షణం ఉద్యోగం -పొందే డేటా ఎంట్రీ ఆపరేటర్, హార్డువేర్, ఆన్లైన్ వర్క్, GST, TALLY, ఉర్దు DTP మొదలైన కోర్స్ లకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తామని తెలియజేసారు. డీటీపీ నందు విసిటింగ్ కార్డ్స్ డిజైనింగ్, మ్యారేజ్ కార్డ్స్, బిల్ బుక్స్ ఫ్లెక్సి డిజిటల్ బోర్డ్స్ మొదలైన డిజైనింగ్ వర్క్ కు ప్రాధాన్యత || ఇస్తామని తెలియ జేశారు.


డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ అధికారులకు మరియు ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు మధ్య మంచి సృహుద్భావ వాతావరణం నెలకొల్ని. లైబ్రరీ మరియు కంప్యూటర్ సెంటర్లను అభివృద్ధి చేస్తామని తెలియజేసారు. ఉద్యోగులు తమ సమస్యలైన రెండు సoవత్సరముల ట్రైబ్రరీ కంప్యూటర్ సెంటర్ల భవనముల అద్దె బకాయిలు, ఆఫీస్ ఖర్చులు, కరెంటు, లైబ్రరీ పేపర్ బిల్లుల గురించి తెలియ జేయుచూ ప్రభుత్వము -వారికి బడ్జెట్ ప్రపోజల్స్ పంపించి యున్నామని త్వరలో సమస్యకు పరిస్కారం లభిస్తుందని తెలియ జేశారు. భవనముల అద్దె గురించి.

మాట్లాడుతూ అద్దె భారం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వం వారి పర్మిషన్ తీసుకొని షాదీఖానాల నందు లేదా ఉర్దూ స్కూల్స్ నందు గవర్నమెంట్ భవనములలోకి మారుస్తామని తెలిపారు.


ఈ సమీక్షలో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్య అయిన రెగ్యులర్ చేయాలని కోరుకున్నారు. ఈ సమస్య గురించి మాట్లాడుతూ బోర్డు లో తగిన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కరి సామని తెలియజేసారు. ముఖ్యముగా చైర్మన్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ మీరందరు కుటుంబ సభ్యులు కాబట్టి మీ సమస్యలు నా సమస్యలు గా భావించి మీ అందరికి న్యాయము చేస్తానని తెలియ చేశారు..

ఇనాబ్ నదీమ్ అహ్మద్ ఉర్దూభాష అభివృద్ధి పట్ల, ఉద్యోగుల సమస్య పట్ల ఎంతో చిత్త శుద్ధితో కృషిచేస్తున్నారని డైరెక్టర్ / సెక్రటరీ డా. అయూబ్ హుస్సేన్ తెలియజేసారు. ఈ సందర్భముగా డైరెక్టర్ /సెక్రటరీ చైర్మన్ , బోర్డు సభ్యులకు కృతఙ్ఞతలు తెలియజేసారు..

Related Posts

You cannot copy content of this page