ప్రకాశం జిల్లా
పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు
పెద్ద దోర్నాల…
రేపటి ( సోమవారం ) నుంచి ఏప్రిల్ 18 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు నిర్వహించు పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు తెలిపారు….!!
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు…!!
పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని…,
విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని, కావున దయచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని సూచించారు…!!
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని,
చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు ఎవరైనా పాల్పడినా, వారికి ఎవరైనా సహకరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102194 కు సమాచారం అందించాలని కోరారు…!!