హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా?

Spread the love

కడప : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర (AP Nyay Yatra) కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది..

ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం ఇస్తే జగన్ (CM Jagan) అన్న హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకున్నారని.. మళ్ళీ వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ హంతకుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాష్ (Avinash Reddy) దోషి అని తెలిసినా చర్యలు లేని.. – నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీతో (BJP) పొత్తుతో అవినాష్‌ను కాపాడుతున్నారన్నారు. మాజీ మంత్రి వివేకా (Former Minister Viveka) చావుకు కారణం అయిన అవినాష్ రెడ్డికి సీట్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. హంతకుడిని చట్టసభల్లో పంపాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అవినాష్ గెలిస్తే హంతకుల పాలన వస్తుందని.. హంతకులు గెలవకూడదని తాను ఎంపీ గా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరినీ ఒడించాలన్నారు..

”మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్న. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా? హంతులకు ఓటు వేస్తే మనకు భవిష్యత్ ఉండదు. ఓటు వేసే ముందు ఒక సారి అందరూ ఆలోచన చేయాలి. నేను వైఎస్సార్ బిడ్డను… మీ బిడ్డను.. మీ బలాన్ని. 10 ఏళ్లు రాష్ట్రాన్ని బాబు, జగన్ భ్రష్టు పట్టించారు. విభజన హామీల కోసం ఒక్కరూ పోరాటం చేయలేదు. జగన్ గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు.- రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు” అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

Related Posts

You cannot copy content of this page