రోడ్లపైన, కాలువల్లో చెత్త వేయకండి.కమిషనర్ అనుపమ

Spread the love

Do not litter on the roads and canals.Commissioner Anupama

రోడ్లపైన, కాలువల్లో చెత్త వేయకండి.
*కమిషనర్ అనుపమ


సాక్షిత : రోడ్లపైన, కాలువల్లో చెత్త వేయకుండా, తమ సిబ్బందికి అందజేసి నగర పరిశుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని 16 వార్డులో గల యాదవ వీధి, దాసరి మఠం, ఎస్ బి ఐ కాలనిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ మోహన్ కృష్ణ తో కలసి కమిషనర్ పరిశీలించారు.

అక్కడక్కడా డ్రైనేజీ కాలువల్లో చెత్త ఉండటాన్ని గుర్తించి కాలువలు బాగా శుభ్రం చేయాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ప్రజలు, దుకాణ దారులు రోడ్లపైన, కాలువల్లో చెత్త వేయరాదని అన్నారు. అలా ఎవరైనా వేస్తే వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నిత్యం తమ సిబ్బంది మీ వీధుల్లోకి వస్తున్నారని, మీరు తడి, పొడి చెత్త వేర్వేరుగా అందచాలన్నారు. నగర పరిశుభ్రతకు ప్రజలు కూడా తమవంతు గా సహకరించాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

దాసరి మఠం లో డ్రైనేజీ కాలువ పగిలి పోయి త్రాగునీటిలో కలుస్తున్నాయని కార్పొరేటర్ తెలుపగా , కమిషనర్ పరిశీలించారు. వెంటనే పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

కమిషనర్ వెంట ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరికృష్ణ, శానిటరి సూపర్ వైజర్ సుమతి, వార్డు నాయకులు అమోస్ బాబు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page