
తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలలో రాజీ పడొద్దు. తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డు లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలో రాజీ పడొద్దని తుడా ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఉదయం నగరంలోని రాయల్ చెరువు రోడ్ లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పదొడ్డని అధికారులను ఆదేశించారు. ప్లాన్, ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించెందుకు వీలుంటుందని అన్నారు. సమావేశంలో సెక్రటరీ వెంకట నారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, అడ్వైజర్ రామకృష్ణ రావు, డి.ఈ.భాషా, ఏ.ఈ.షణ్ముగం, కె.పి.సి సంస్థ ఈ.డి.సుశీల్ కుమార్, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app