సాక్షిత గద్వాల:-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బల్గేర శివారెడ్డిని నియమించిందని, ఆయనకు నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటూ పోటీ నుండి తప్పుకొని బీజేపీ అభ్యర్థిగా శివారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు నిరుపేదలకు చేరాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా డీకే కుటుంబాన్ని ఆదరించినట్లుగానే నియోజకవర్గ ప్రజలు బీసీ వర్గానికి చెందిన శివారెడ్డిని ఆదరించాలని కోరారు….
బీజేపీ గద్వాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బల్గేర శివారెడ్డిని ప్రకటించిన : డీకే అరుణ*
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…