ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ

Spread the love

తిరుమల: ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో బ్రేక్‌ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు తెలిపారు.

వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. కరోనాకు ముందు నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లను తితిదే జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో వీటిని నిలిపివేసిన తితిదే.. తాజాగా మళ్లీ నడిచి వచ్చే భక్తుల కోసం దివ్యదర్శన టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page